భారతదేశం, ఫిబ్రవరి 22 -- వందే భారత్ ట్రైన్స్ వచ్చాక చాలా మంది ఇబ్బంది లేకుండా ప్రయాణం చేస్తున్నారు. జర్నీలో ఎక్కువగా అలసిపోకుండా నేరుగా సొంతూళ్లకు వెళ్తున్నారు. అంతేకాదు వేగంగా సిటీలను ఈ రైళ్లు కనెక్ట్ చేస్తాయి. దీంతో వీటిలో ప్రయాణించేందుకు జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక సికింద్రాబాద్-విశాఖపట్నం రూట్‌లో వందే భారత్ రైలుకు డిమాండ్ ఎక్కువగా ఉంది.

ఈ రూట్‌లో ఉన్న డిమాండ్ ఆధారంగానే ఇటీవల కోచ్‌లను పెంచారు. నిజానికి ఈ రూట్‌లో మెుదట 16 కోచ్‌లతోనే వందే భారత్ రైళ్లు నడిచాయి. అయితే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కోచ్‌లను 20కి పెంచారు. ఇందులో ఏసీ చైర్ కార్‌కోచ్‌లు 18 కాగా.. ఎగ్జిక్యూటివ్ చైర్ కోచ్‌లు రెండు ఉన్నాయి. దీంతో సీటింగ్ కెపాసిటీ.. 1128 నుంచి 1440కు పెరిగింది. సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ ట్రైన్ ప్రారంభించినప్పటి నుంచి ఆక్యుపెన్సీకి మించిన...