భారతదేశం, అక్టోబర్ 4 -- భారత మార్కెట్‌లో అనేక సంవత్సరాలుగా కార్యకలాపాలు సాగిస్తున్నప్పటికీ, మాస్-మార్కెట్ ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) సెగ్మెంట్‌లోకి రెనాల్ట్ ఇంకా అడుగుపెట్టలేదు. ఫ్రెంచ్ ఆటోమేకర్ తమ ఇతర మోడళ్లకు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లను ఇస్తున్నా, క్విడ్ ఎలక్ట్రిక్ వర్షన్ మాత్రం కార్యరూపం దాల్చలేదు. అయితే, ఈ నిరీక్షణకు త్వరలోనే తెరపడే అవకాశం ఉంది. ఎందుకంటే, మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్న రెనాల్ట్ క్విడ్ ఈవీ టెస్ట్ మోడల్ ఒకటి చెన్నైలో పరీక్షల సమయంలో కెమెరా కంటికి చిక్కింది. ఈ సరికొత్త టెస్ట్ మోడల్.. క్విడ్ హ్యాచ్‌బ్యాక్‌కు పూర్తి డిజైన్ మార్పులు తీసుకురావడంతో పాటు పాత క్విడ్ ప్రత్యేకతలను కూడా కొనసాగించింది!

రెనాల్ట్ క్విడ్ ఈవీ కారు డాసియా స్ప్రింగ్​ ఈవీ మోడల్‌పై ఆధారపడి ఉంటుంది. ఇది ముఖ్యంగా రొమేనియన్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌న...