భారతదేశం, ఫిబ్రవరి 23 -- ప్రముఖ బాలీవుడ్ గాయకుడు అరిజీత్ సింగ్ పాడిన సరికొత్త పాట 'ఏక్ దిన్' (Ek Din) తాజాగా విడుదలైంది. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్, సాయి పల్లవి నెక్ట్స్ మూవీ 'ఏక్ దిన్' కోసమే అరిజీత్ ఈ అద్భుతమైన పాటను పాడాడు. అయితే ఈ పాట మేకింగ్ వీడియోలో ఆమిర్ ఖాన్, అరిజీత్ సింగ్ కలిసి గడిపిన అందమైన క్షణాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అరిజీత్ తన సొంతూరిలో ఎంత సింపుల్‌గా ఉంటారో ఈ వీడియో ద్వారా మరోసారి అందరికీ తెలిసింది.

జీ మ్యూజిక్ కంపెనీ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో సాయి పల్లవి మూవీ ఏక్ దిన్ పాట మేకింగ్ వీడియోను విడుదల చేశారు. వీడియో ప్రారంభంలోనే ఆమిర్ ఖాన్, అరిజీత్ సింగ్ మధ్య జరిగిన ఒక ఆసక్తికరమైన సంభాషణను చూపించారు. ఇద్దరూ నేలపై చాలా సింపుల్‌గా కూర్చుని మాట్లాడుకుంటున్నారు.

అప్పుడు ఆమిర...