భారతదేశం, ఏప్రిల్ 8 -- 2025 టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ఎస్​యూవీని సంస్థ తాజాగా లాంచ్​ చేసింది. ఈ మోడల్​కి కీలక ఫీచర్స్​ని యాడ్​ చేసి, స్పెసిఫికేషన్స్​లో మార్పులు చేసింది. ఫలితంగా ఈ ఎస్​యూవీ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ .11.14 లక్షల నుంచి రూ .11.34 లక్షలకు స్వల్పంగా పెరిగింది. టయోటా నుంచి 2022లో లాంచ్ అయిన కాంపాక్ట్ ఎస్​యూవీ హైరైడర్.. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, స్కోడా కుషాక్, హోండా ఎలివేట్, వోక్స్​వ్యాగన్ టైగన్, మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా వంటి వాటికి గట్టిపోటీని ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

2025 టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్​కు అనేక అప్డేట్స్​ ఉన్నాయి. టాప్​ వేరియంట్లలో, సౌకర్యాన్ని పెంచడానికి 8-వే అడ్జెస్టెబుల్ పవర్ డ్రైవర్ సీట్​, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి ఫీచర్లు కొత్తగా వచ్చాయి. ముఖ్యంగా ల...