భారతదేశం, డిసెంబర్ 17 -- చాలా మంది భారతీయులు ఇప్పుడు ఒక కారు కొనేముందు అనేక ఫీచర్లను దృష్టిల్ పెట్టుకుంటున్నారు. ఆ చెక్​-లిస్ట్​ పూర్తి అయితేనే సంబంధిత మోడల్​ని కొనేందుకు ముందుకెళుతున్నారు. ఈ చెక్​-లిస్ట్​లో పానోరమిక్​ సన్​రూఫ్​ ఫీచర్​ కచ్చితంగా ఉంటోంది!

భారతదేశ వాతావరణ పరిస్థితుల్లో కార్లలో పానోరమిక్ సన్‌రూఫ్‌ల ప్రాక్టికాలిటీపై చాలా కాలంగా చర్చ జరుగుతున్నప్పటికీ, ఈ ఫీచర్ వాటి మోడల్, పరిమాణంతో సంబంధం లేకుండా కార్లకు ఒక ప్రీమియం లుక్ ఇస్తుందనడంలో సందేహం లేదు. వాస్తవానికి గతంలో ఈ ఫీచర్​ లగ్జరీ, ప్రీమియం కార్లకు మాత్రమే పరిమితం అయ్యేది. కానీ ఇప్పుడు మాస్​ మార్కెట్​ మోడల్స్​కి కూడా అందుబాటులోకి వచ్చింది.

మీరు పానోరమిక్ సన్‌రూఫ్‌తో కూడిన, రూ. 15 లక్షల లోపు ధర కలిగిన ఎస్‌యూవీని కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే, ఇక్కడ టాప్ ఐదు ఆప్షన్స్​ని ఇస్...