భారతదేశం, ఏప్రిల్ 14 -- సుజుకి మోటార్ సైకిల్ ఇండియా ద్విచక్ర వాహనాలను కొనడం ఇప్పుడు ఈజీగా అయింది. కంపెనీ తన ద్విచక్ర వాహనాలను ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో కూడా అందుబాటులోకీ తీసుకొచ్చింది. ఇందుకోసం సుజుకి మోటార్ సైకిల్ ఇండియా ఫ్లిప్‌కార్ట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

ఈ భాగస్వామ్యాల ప్రయోజనం దేశంలోని 8 రాష్ట్రాల్లో లభిస్తుంది. వీటిలో కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మేఘాలయ, మిజోరం ఉన్నాయి. అదే సమయంలో కంపెనీకి చెందిన 8 మోడళ్లను ఈ ప్లాట్‌ఫామ్ నుంచి కొనుగోలు చేయవచ్చు. ఇందులో అవెనిస్ స్కూటర్లు, జిక్సర్, జిక్సర్ ఎస్ఎఫ్, జిక్సర్ 250, జిక్సర్ ఎస్ఎఫ్ 250, వి-స్ట్రోమ్ ఎస్ఎక్స్ వంటి మోడళ్లు ఉన్నాయి.

భవిష్యత్తులో మరిన్ని రాష్ట్రాలకు తమ ద్విచక్ర వాహనాలకు ఆన్‌లైన్ బుకింగ్ సేవలను విస్తరించాలని సుజుకి యోచిస్తోంది....