భారతదేశం, జూన్ 17 -- షిర్డీ సాయి సన్నిధిని దర్శించుకునే భక్తులకు ఐఆర్సీటీసీ విజయవాడ నుంచి మూడు రాత్రులు/నాలుగు రోజుల టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ఈ టూర్‌లో షిర్డీ, శని శింగనాపూర్ కవర్ చేస్తారు. ప్రతి మంగళవారం ఈ టూర్ మెుదలవుతుంది. ఈ టూర్‌కు సంబంధించిన ప్యాకేజీ వివరాలు చూద్దాం..

ప్రతి మంగళవారం ఈ టూర్ ప్రారంభం అవుతుంది. రూ.5,680 నుంచి ప్యాకేజీలు మెుదలవుతాయి. షిర్డీ, శని శింగనాపూర్‌కు దర్శించుకుని, ఆధ్యాత్మిక అనుభూతిని పొందాలనుకునే భక్తులకు ఈ టూర్ ప్యాకేజీ చాలా బాగుంటుంది. 3 రాత్రులు, 4 రోజుల్లో సాగే ఈ టూర్‌లో షిర్డీ సాయి నాథుడ్ని దర్శించుకోవచ్చు. ఈ టూర్ జూన్ 24వ తేదీన ఉంది.

ఒకరి నుంచి ముగ్గురు ప్యాసింజర్లకు చూసుకుంటే క్లాస్(కంఫర్ట్ 3AC) -సింగిల్ ఆక్యుపెన్సీ రూ. 16150, డబుల్ ఆక్యుపెన్సీ రూ. 10100, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.8520, పిల్లలకు రూ.7...