భారతదేశం, ఫిబ్రవరి 9 -- కర్ణాటక రాజధాని బెంగళూరులో సభ్య సమాజం తలదించుకునే దారుణ ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. కన్నతల్లిని దేవతలా పూజించాల్సిన కూతురు.. ప్రియుడి మాటలు నమ్మి అమ్మకే ద్రోహం చేసింది! తల్లి నిద్రిస్తున్న సమయంలో ఆమె ప్రైవేట్ ఫోటోలు తీసి, తన ప్రియుడికి పంపించింది.

బెంగళూరు మైసూరు రోడ్ సమీపంలో నివసిస్తున్న ఒక మధ్యతరగతి కుటుంబంలో ఈ ఘటన జరిగింది. 49 ఏళ్ల బాధితురాలికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె బీబీఏ పూర్తి చేసి ప్రస్తుతం నిరుద్యోగిగా ఉంది. చదువు, ఉద్యోగ ప్రయత్నాల కోసం స్మార్ట్‌ఫోన్ కావాలని తండ్రిని కోరడంతో, వారు ఆమెకు ఫోన్ కొనిచ్చారు. అయితే, అదే ఫోన్ ఆమెను దారి తప్పేలా చేస్తుందని ఆ తల్లిదండ్రులు ఊహించలేదు.

సుమారు నెల రోజుల క్రితం, తల్లి ఇంట్లో పని చేసుకుంటూ తన పెద్ద కూతురు గదిలోకి వెళ్లింది. ఆ సమయంలో కూతురు ఎ...