భారతదేశం, ఫిబ్రవరి 9 -- ఫిబ్రవరి 8 నుండి 18వ తేదీ వరకు శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. మహా శివరాత్రి ఫిబ్రవరి 15న వస్తుంది. ఆ రోజు ప్రభుత్సవం, పాగా అలంకరణ, బ్రహ్మోత్సవ కల్యాణం జరగనుంది. ఫిబ్రవరి 16వ తేదీన మల్లిఖార్జునస్వామి, అమ్మవారి రథోత్సవం ఉంటుంది. 11 రోజులపాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.

మరోవైపు శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానాన్ని కలిపే ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్‌లు కొనసాగుతున్నాయి. ఆదివారం నుండి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనందున, భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి కార్లలో తరలివచ్చారు. దీని ఫలితంగా శ్రీ సాక్షి గణపతి ఆలయం నుండి శ్రీశైలం ఆలయం వరకు ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

బ్రహ్మోత్సవాల కారణంగా ఆలయానికి కార్లు పెద్ద సంఖ్యలో రావడంతో ట్రాఫిక్‌ను నియంత్రించడంలో పోలీస...