భారతదేశం, నవంబర్ 8 -- తిరుమల శ్రీవారి ఆలయంలో కార్తీక వన భోజన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటన విడుదల చేసింది. నవంబర్ 9వ తేదీన తిరుమలలోని గోగర్భం సమీపంలో గల పార్వేటమండపంలో ఈ కార్యక్రమం జరుగనుంది.
పవిత్రమైన కార్తీక మాసంలో వనభోజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఉదయం 8.30 గంటలకు శ్రీ మలయప్పస్వామివారు చిన్న గజవాహనంపై, ఉభయనాంచారులు పల్లకిపై ఆలయంనుంచి బయలుదేరి ఊరేగింపుగా పార్వేటమండపానికి వేంచేపు చేస్తారు.
ఉదయం 11 గంటల నుంచి 12 గంటల నడుమ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహిసారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. అటు పిమ్మట మధ్యాహ్నం 1 నుండి 2 గంటల నడుమ కార్తీక వనభోజన కార్యక్రమం నిర్వహిస్తారు.
కార్తీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.