Hyderabad, జూలై 9 -- పూర్వం ఒకసారి శ్రీకృష్ణుడి దేవేరులు, రుక్మిణి, సత్యభామ మొదలైనవారు రాధారాణి వద్దకు వచ్చి, బృందావనంలో బాలకృష్ణుడి లీలలను వివరించమని కోరారు. రాధారాణి వారికి వివరిస్తూ ఉన్న సమయంలో, అటుగా వెళ్తున్న శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్రలు తలుపువద్ద నిలబడి వినసాగారు. ఈ సమయంలో అక్కడకు చేరిన నారదమహర్షి, "మీరు అలాగే ఉండండి," అని కోరాడు. నారదుడి కోరిక మేరకు వారు ఈ క్షేత్రంలో కొలువుదీరినట్లు చెబుతారు. అంతేకాకుండా, ఇక్కడ దేవతామూర్తులను సృష్టికర్త బ్రహ్మ దేవుడు ప్రతిష్ఠించినట్లు పురాణాలు వెల్లడిస్తున్నాయి అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త, బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

పూర్వం ఈ ప్రాంతానికి 'ఉత్కళ' రాజ్యం అని పేరు. ఈ రాజ్య పాలకుడు ఇంద్రద్యుమ్నుడు. దైవభక్తిపరాయణుడు అయిన ఇంద్రద్యుమ్నుడికి ఒక కోరిక ఉండేది. ఒక ఆలయ...