భారతదేశం, ఫిబ్రవరి 12 -- ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలని, మంచి ఫలితాలు కలగాలని, చేపట్టిన పనుల్లో ఆటంకాలు కలగకుండా ఉండాలని భగవంతుని ఆరాధిస్తారు. శివరాత్రి చాలా విశేషమైన రోజు. హిందూ ధర్మం ప్రకారం శివరాత్రి చాలా ముఖ్యమైన పండుగ. శివుడిని ఆ రోజు ఆరాధించడం వలన శివ అనుగ్రహాన్ని పొందడానికి వీలవుతుంది. భక్తిశ్రద్ధలతో ఒక పువ్వు సమర్పించినా కూడా శివుని అనుగ్రహాన్ని పొందడానికి వీలవుతుంది.

శివరాత్రి నాడు కొన్ని పరిహారాలను పాటిస్తే పరమశివుడు మిక్కిలి సంతోషిస్తాడు. శివుని అనుగ్రహంతో సమస్యలన్నీ తీరి ఆనందంగా ఉండొచ్చు. శివరాత్రి నాడు శివుడిని ఆరాధించి, ఉపవాసం ఉండి, సాయంత్రం జాగరణ చేస్తే అద్భుతమైన ఫలితాలను చూడొచ్చు. అలాగే ధనప్రాప్తి కలగడానికి, ఉద్యోగం లేదా వ్యాపారంలో పురోగతి, పదోన్నతులు కలగడానికి ఏం చేయాలి, ఎలాంటి పరిహారాలను పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

శ...