భారతదేశం, డిసెంబర్ 27 -- ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పా శెట్టికి బాంబే హైకోర్టులో పెద్ద ఊరట లభించింది. సోషల్ మీడియా వేదికలపై ఆమెకు సంబంధించి ప్రచారమవుతున్న అసభ్యకరమైన మార్ఫింగ్ చిత్రాలు, డీప్‌ఫేక్ వీడియోలను వెంటనే తొలగించాలని న్యాయస్థానం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ కంటెంట్ ఆమె వ్యక్తిగత గోప్యతను, గౌరవాన్ని తీవ్రంగా ఉల్లంఘిస్తోందని ధర్మాసనం అభిప్రాయపడింది.
ఈ కేసును విచారించిన జస్టిస్ అద్వైత్ సేత్నా ఏకసభ్య ధర్మాసనం, సోషల్ మీడియాలో ఉంచిన ఆ కంటెంట్‌ను పరిశీలించిన తర్వాత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
"సోషల్ మీడియాలో ఉన్న ఈ కంటెంట్ అత్యంత అభ్యంతరకరంగా ఉంది. ఏ వ్యక్తినీ వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగేలా, వ్యక్తిగత గోప్యతను దెబ్బతీసేలా చిత్రించడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరికీ గౌరవంగా జీవించే హక్కు ఉంటుంది" అని జస్టిస్ అద్వైత్ సేత్నా వ్య...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.