భారతదేశం, డిసెంబర్ 22 -- శాంసంగ్ గెలాక్సీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎస్26 సిరీస్ లాంచ్‌పై తాజాగా కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రతి ఏడాది జనవరిలోనే తన ఫ్లాగ్‌షిప్ ఫోన్లను పరిచయం చేసే శాంసంగ్, ఈసారి తన షెడ్యూల్‌ను కాస్త మార్చినట్లు కనిపిస్తోంది! లేటెస్ట్ లీకుల ప్రకారం.. గెలాక్సీ ఎస్26 అల్ట్రాతో కూడిన ఈ కొత్త స్మార్ట్​ఫోన్​ సిరీస్ జనవరిలో కాకుండా ఫిబ్రవరిలో విడుదలయ్యే అవకాశం ఉంది.

సాధారణంగా శాంసంగ్ తన ఎస్ సిరీస్ ఫోన్లను జనవరి చివరి వారంలో లాంచ్ చేసి, ఫిబ్రవరిలో విక్రయాలకు తీసుకొస్తుంది. అయితే, ప్రముఖ టిప్‌స్టర్ 'ఐస్ యూనివర్స్' తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన సమాచారం ప్రకారం.. 'గెలాక్సీ అన్‌ప్యాక్డ్' ఈవెంట్ ఈసారి ఫిబ్రవరిలో జరగనుంది. ఈ లెక్కన వినియోగదారులకు ఈ ఫోన్లు మార్చి నెలలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంద...