భారతదేశం, జనవరి 14 -- శబరిమలలో పొన్నంబలమేడు పర్వత శిఖరాల్లో మకర జ్యోతి భక్తులకు దర్శనం ఇచ్చింది. లక్షలాది మంది అయ్యప్ప భక్తులు జ్యోతిని దర్శనం చేసుకుని పులకరించిపోయారు. ఈ సందర్భంగా శబరిమల మెుత్తం అయ్యప్ప నామస్మరణతో మారుమోగిపోయింది. అంతకుముందు పందాళం నుండి తెచ్చిన తిరువాభరణంతో స్వామివారికి అలంకరించారు.

అనంతరం స్వామివారికి హారతి ఇచ్చారు. ఆ తర్వాత వెంటనే పొన్నంబలమేడు పర్వత శిఖరాల్లో మకర జ్యోతి దర్శనం అయింది. లక్షలాది మంది భక్తులు ఈ శుభ క్షణాన్ని వీక్షించి పరవశించిపోయారు. సాయంత్రం నిర్ణీత సమయానికి వెలిగిన దివ్య జ్యోతిని దర్శించుకునేందుకు లక్షలాది మంది అయ్యప్ప భక్తులు సన్నిధానం, కొండలపైకి తరలివచ్చారు . స్వామియే శరణం అయ్యప్ప అనే నామస్మరణతో శబరిమల వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భక్తులు పులకరించిపోయారు.

సాయంత్రం 6.40 గంటల ప్రాంతంలో మకర జ్యోతి...