భారతదేశం, మే 18 -- టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను తుళ్లూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. టీడీపీ నేత ఇసకపల్లి రాజుపై దాడి ఘటనపై నందిగం సురేష్ పై కేసు నమోదు అయింది.
టీడీపీ కార్యకర్త ఇసకపల్లి రాజుపై దాడి కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు జిల్లా ఉద్దండరాయునిపాలెంలో శనివారం రాత్రి రాజుపై నందిగం సురేష్, ఆయన సోదరుడు ప్రభు దాసు, బంధువులు మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రాజు మంగళగిరి ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నాడు.
ఈ ఘటనపై రాజు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఉద్దండరాయునిపాలెంలో నందిగం సురేష్ ను అదుపులోకి తీసుకున్నారు.
శనివారం రాత్రి ఉద్దండరాయునిపాలెంలో ఓ కారు వేగంగా దూసుకొచ్చింది. అతివేగంపై కారు ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.