భారతదేశం, మే 31 -- బిగ్‌బాస్ ఫేమ్ అర్జున్ అంబ‌టి హీరోగా న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ ప‌ర‌మ‌ప‌ద‌సోపానం. డిఫ‌రెంట్ రొమాంటిక్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీతో పూరి జ‌గ‌న్నాథ్ శిష్యుడు నాగ‌శివ డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. ఈ సినిమాలో అర్జున్ అంబ‌టికి జోడీగా జెన్నిఫ‌ర్ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా క‌నిపించ‌బోతున్న‌ది. ప‌ర‌మ ప‌ద సోపానం మూవీ జూలై 11న థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతోంది.

ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. బూమ్ బూమ్ అంటూ సాగిన ఈ మాస్ పెప్పీ సాంగ్‌ను గీతా మాధురి ఆల‌పించింది. రాంబాబు గోశాల ఈ పాట‌ను రాశారు. డేవ్ జాంద్ మ్యూజిక్ అందించారు. బూమ్ బూమ్ పాట హుషారైన స్టెప్పులు, లిరిక్స్‌తో మ్యూజిక్ ల‌వ‌ర్స్‌ను ఆక‌ట్టుకుంటోంది. ప‌ర‌మ ప‌ద‌సోపానం మూవీలో స్పెష‌ల్ సాంగ్‌గా బూమ్ బూమ్ క‌నిపించ‌బోతున్న‌ట్లు తెలుస్...