భారతదేశం, డిసెంబర్ 23 -- మీరు ఎంతో కష్టపడి, సంవత్సరాల తరబడి డబ్బులు పోగు చేసి కొనుగోలు చేసిన కారులో భద్రతా లోపాలు ఉంటే? అసలు వెనుక సీట్లల్లో కూర్చుంటే ప్రాణాలు గాల్లోనే కలిసిపోతాయని వింటే? మేడ్​-ఇన్​- ఇండియా సుజుకీ ఫ్రాంక్స్​ని కొనుగోలు చేసిన వారి పరిస్థితి ఇప్పుడు ఇదే! తాజాగా నిర్వహించిన ఆస్ట్రేలేషియన్​ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (ఏఎన్​సీఏపీ) క్రాష్ టెస్టులో ఈ క్రాస్​ఓవర్​ అత్యంత పేలవమైన ప్రదర్శన చేసింది. అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయని ప్రచారం చేసుకుంటున్నప్పటికీ, ఈ కారుకు కేవలం 1-స్టార్ రేటింగ్ మాత్రమే లభించింది. ఈ కారు వెనుక భాగంలో కూర్చోకపోవడమే ఉత్తమం అని స్వయంగా క్రాష్​ టెస్ట్​ చేసిన వారు హెచ్చరిస్తుండటం గమనార్హం.

క్రాష్ టెస్టులో బయటపడిన అత్యంత భయంకరమైన విషయం సీటు బెల్టుల వైఫల్యం! సుజుకీ ఫ్రాంక్స్​పై ఫ్రెంటల్​ క్రాష్​ టెస్...