భారతదేశం, ఫిబ్రవరి 17 -- తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. చలి తీవ్రత తగ్గుతూ. ఎండలు పెరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. ఈ నెల దాటిన తర్వాత ఎండల తీవ్రత ఎక్కువగా ఉండనుంది.
ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో సాధారణం కన్నా ఒక డిగ్రీ ఎక్కువగా ఉష్ణోగ్రత నమోదవుతోంది. చాలా జిల్లాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో ఉక్కపోత కూడా ప్రారంభమైంది. అయితే ఈ ఏడాదిలో ఎండల తీవ్రత ఎక్కువగానే ఉండే సూచనలున్నాయని ఐఎండీ అంచనా వేస్తోంది.
మరోవైపు దక్షిణ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో సోమవారం అల్పపీడం ఏర్పడింది. ఇది ఈనెల 18వ తేదీ నాటికి నైరుతి బంగాళాతం వైపు కదులుతూ హిందూ మహాసముద్ర మీదుగా మరింతగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.