భారతదేశం, నవంబర్ 9 -- తెలంగాణలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలి తీవ్రత పెగుతుంది. నవంబర్ 11 నుంచి 19 మధ్య తెలంగాణలో తీవ్రమైన చలిగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. నవంబర్ 13 నుండి 17 వరకు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపింది.

తెలంగాణలోని జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువకు పడిపోయే అవకాశం ఉంది. హైదరాబాద్‌తో సహా పలు జిల్లాల్లో తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు 11 డిగ్రీలు, 14 డిగ్రీల మధ్య ఉంటాయని అంచనా. దక్షిణ, తూర్పు తెలంగాణ జిల్లాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉన్న జిల్లాల్లో 14 డిగ్రీలు, 17 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉంది.

8 నుంచి 10 రోజులు ఇలా దీర్ఘకాలం పాటు చలి పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ కాలంలో అసాధారణమని, ఈ సంవత్సరం చలి సాధారణం కంటే ఎక్కువ కాలం ఉంటుందని వాతావర...