భారతదేశం, ఫిబ్రవరి 19 -- రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి పనుల్లో బిజీగా మారిపోయారు. వెడ్డింగ్ వైబ్స్ తో గ్రాండ్ మ్యారేజీకి రెడీ అవుతున్నారు. ఈ జంట ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లోని ఓ ప్యాలెస్ లో వివాహం చేసుకోనున్నారు. తమ వెడ్డింగ్ పై ఈ జంట సైలెంట్ గానే ఉన్నా సోషల్ మీడియాలో లీక్ అయిన పెళ్లి పత్రిక ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.

రష్మిక మందన్నతో పెళ్లి నేపథ్యంలో హైదరాబాద్ లోని విజయ్ దేవరకొండ ఇంటిని గోల్డెన్ కలర్ లైట్స్ తో మెరిసేలా డెకరేషన్ చేశారు. పెళ్లి అయ్యాక కొత్త కోడలు రష్మిక మందన్నకు వెల్ కమ్ చెప్పేందుకు ఇంటిని ముస్తాబు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ లో ఉన్న విజయ్ దేవరకొండ ఇంటి ఫొటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. విజయ్ దేవరకొండ ఇంటి బయట నుంచి తీసిన ఒక వీడియోను ఓ ఫోటోగ్రాఫర్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు.

రష్మిక మందన్న రాక కోసం ముస్త...