భారతదేశం, జూన్ 11 -- తమిళ సూపర్ స్టార్ సూర్య కొత్త మూవీ అఫీషియల్ గా లాంఛ్ అయింది. తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సూర్య 46 వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది. ఈ మేరకు మేకర్స్ బుధవారం (జూన్ 11) సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ఇంటర్నెట్ లో వైరల్ గా అవుతోంది.

సూర్య-వెంకీ అట్లూరి కాంబినేషన్ లో కొత్త మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయినట్లు మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో సూర్య నడుచుకుంటూ వెళ్తున్న ఫోజులో ఉన్నారు. ఈ పోస్టర్ పై ''అండ్ సెలబ్రేషన్ బిగిన్స్ (ఇక సంబరాలు షురూ)'' అని రాసుకొచ్చారు. ''సెలబ్రేషన్, ఎమోషన్, ఎంటర్ టైన్ మెంట్ దిశగా తొలి అడుగు'' అని ఆ పోస్టుకు క్యాప్షన్ యాడ్ చేశారు.

రెట్రో మూవీ సూర్యకు మిక్స్ డ్ రిజల్ట్ అందించింది. తమిళంలో ఈ యాక్షన...