భారతదేశం, నవంబర్ 11 -- తెలుగు రాష్ట్రాల్లో వరుస బస్సు ప్రమాదాలు జరుగుతున్నాయి. కర్నూలులో బస్సు కాలిబూడిదైన ఘటనలో 19 మంది ప్రయాణికులు చనిపోయారు. చేవెళ్లలోనూ ఆర్టీసీ బస్సుపై కంకర పడి 19 మంది మృతిచెందారు. ఇలా వరుస ప్రమాదాలు మరిచిపోకముందే మరో ఘటన జరిగింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మాత్రం పూర్తిగా దగ్ధమైంది.

హైదరాబాద్ - విజయవాడ హైవేపై ఒక ప్రైవేట్ ఆపరేటర్ బస్సు దగ్ధమైంది. ఈ సంఘటనలో 29 మంది ప్రయాణికులు తప్పించుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున నల్గొండ జిల్లాలోని చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామం సమీపంలో హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్‌లోని కందుకూరుకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి.

విహారి ట్రావెల్స్‌కు చెందిన ఈ ఏసీ స్లీపర్ కోచ్ బస్సు హైదరాబాద్‌లో అర్ధరాత్రి దాటిన తర్వాత బయల్దేరింది....