భారతదేశం, ఫిబ్రవరి 21 -- వీకెండ్ లో ఓటీటీలో ఏం చూడాలా అని ఆలోచిస్తున్నారా? మీకు రెండు రోజులకు సరిపడా వినోదం అందించడానికి చాలా సినిమాలు, వెబ్ సిరీస్ ఓటీటీలో సిద్దంగా ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్, జీ5లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో ఇవి అందుబాటులో ఉన్నాయి. వీటిలో థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్, హారర్ థ్రిల్లర్ జానర్లలో సినిమాలు, సిరీస్ ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.

తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ ఇది. రెండు నెలల కిందట థియేటర్లలో రిలీజైనా పెద్దగా రెస్పాన్స్ రాలేదు. ఇప్పుడు ప్రైమ్ వీడియోలోకి స్ట్రీమింగ్ కు వచ్చింది. హెబ్బా పటేల్ నటించిన ఈ సినిమా నలుగురు స్నేహితులు.. మూడు రోజుల పాటు ఓ దెయ్యాల కొంపలో ఎలా ఉన్నారనే కథ చుట్టూ తిరుగుతుంది.

ఇదో తమిళ మూవీ. ఇది ప్రైమ్ వీడియోతోపాటు మరో ఐదు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లోకి వచ్చింది...