భారతదేశం, డిసెంబర్ 7 -- అందమైన ప్రకృతి అందాలకు కేరాఫ్ అయిన అరకును చూడాలనుకుంటున్నారా..? అయితే మీకోసమ విశాఖపట్నం నుంచి ఓ టూర్ ప్యాకేజీ అందుబాటులోకి రానుంది. బడ్జెట్ ధరలోనే ఈ ప్యాకేజీని ఆపరేట్ చేసేందుకు ఐఆర్సీటీసీ టూరిజం సిద్దమైంది.

IRCTC టూరిజం.. 'విశాఖపట్నం - అరకు రైల్ కమ్ రోడ్ ప్యాకేజీ' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్ ప్యాకేజీ 12 డిసెంబర్, 2025వ తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో ప్లాన్ చేసుకోవచ్చు. ఈ వివరాలను ఐఆర్సీటీసీ టూరిజం వెబ్ సైట్ లో చెక్ చేసుకోవాలి.

ఈ టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే.. కంఫర్ట్ క్లాస్ లో సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. 20035, డబుల్ అక్యుపెన్సీకి రూ. 10860,ట్రిపుల్ అక్యుపెన్సీకి రూ. 8450గా నిర్ణయించారు. చిన్నారులకు వేర్వురు ధరలుంటాయి. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి ధరలకు సంబం...