భారతదేశం, జూన్ 16 -- అంతర్జాతీయ యోగా దినోత్సవం (IDY) పది సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా, ఈ ఏడాది (11వ ఎడిషన్) జాతీయ స్థాయిలో వేడుకలకు ఆతిథ్యం ఇవ్వనున్న విశాఖపట్నం నగరం ముస్తాబవుతోంది. ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉన్నతాధికారులు కలిసి ఇక్కడ కీలక సమీక్షా సమావేశాన్ని నిర్వహించడంతో పాటు, ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ మేరకు ఆయుష్ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

ప్రధానమంత్రి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా యోగాను ప్రజలందరికీ చేరువ చేయాలనే లక్ష్యంతో ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ సమీక్ష జరిగింది.

ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కోటేచా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే. విజయానంద్ ఈ క్షేత్రస్థాయి పరిశీలన, సమీక్షకు నాయకత్వం వహించారు. వీరితో పాటు ఆయుష్ మంత్రిత్వ శాఖ జాయి...