భారతదేశం, డిసెంబర్ 12 -- వివో ఎక్స్​200 సిరీస్ అరంగేట్రం చేసినప్పటి నుంచి మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది. ఇక ఇప్పుడు, పలు మీడియా నివేదికల ప్రకారం ఈ సిరీస్​లో కొత్త స్మార్ట్​ఫోన్​ లాంచ్​కు రెడీ అవుతోందని తెలుస్తోంది. దాని పేరు వివో ఎక్స్​200టీ. ఫ్లాగ్‌షిప్ పవర్​ని, సరసమైన ధరను బ్యాలెన్స్ చేసే పరికరం కోసం వేచి చూస్తున్న వారికి, ఇది ఒక మంచి ఆప్షన్​ కావచ్చు. ఈ స్మార్ట్​ఫోన్​ గురించి ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ అందించిన వివరాల ప్రకారం.. వివో ఎక్స్​200టీ స్మార్ట్‌ఫోన్ 2026 జనవరి నెలాఖరులో భారతదేశంలో విడుదల కానుంది.

2026లో మార్కెట్​లో అనేక కొత్త స్మార్ట్​ఫోన్స్​ లాంచ్​కానున్నాయి. ఈ సమయంలోనే ఈ ఎక్స్​200టీని విడుదల చేయడం వ్యూహాత్మకంగా నిర్ణయం! దీని ద్వారా, ఇటీవల లాంచ్ అయిన ఎక్స్​300 సిరీస్, ఎక్స్​200టీ ...