భారతదేశం, జూన్ 20 -- విపరీతమైన చాట్​జీపీటీ వినియోగంతో ప్రజల్లో సైడ్​ ఎఫెక్ట్స్​ కనిపిస్తున్నట్టు ఎంఐటీ మీడియా ల్యబ్​ పరిశోధకుల తాజా అధ్యయనం వెల్లడించింది. ఏఐ చాట్​బాట్​ వినియోగంతో బ్రెయిన్​ ఎంగేజ్​మెంట్​ నానాటికీ పడిపోతోందని ఈ అధ్యయనం ఆందోళన వ్యక్తం చేసింది.

బోస్టన్ ప్రాంతానికి చెందిన 18 నుంచి 39 సంవత్సరాల వయస్సు గల 54 మందిపై పలు నెలల పాటు ఈ అధ్యయనం నిర్వహించారు. ప్రతి ఒక్కరినీ చాట్‌జీపీటీ, గూగుల్ సెర్చ్ లేదా ఎటువంటి డిజిటల్ సాధనం లేకుండా (బ్రెయిన్​ ఓన్లీ) వ్యాసాలు రాయమని కోరారు.

ఫలితాలు షాక్​కి గురి చేశాయి! 32 మెదడు ప్రాంతాలలో మెదడు కార్యకలాపాలను ట్రాక్ చేసిన ఈఈజీ స్కాన్‌లు.. చాట్‌జీపీటీని ఉపయోగించిన వారిలో అత్యల్ప స్థాయి బ్రెయిన్​ ఎంగేజ్​మెంట్​ చూపించాయి. ఈ వినియోగదారులు "నాడీ, భాషా, ప్రవర్తనా స్థాయిలలో నిలకడగా తక్కువ పనితీరును కనబరిచ...