భారతదేశం, ఫిబ్రవరి 11 -- కూట‌మి ప్రభుత్వం ఉద్యోగుల స‌మ‌స్యల‌ను ప్రథ‌మ ప్రాధాన్యత‌తో ప‌రిష్కరిస్తుంద‌ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం డైరీ, క్యాలెండ‌ర్‌ను ఎమ్మెల్యే, పీయుసీ ఛైర్మన్ కూన ర‌వికుమార్‌తో క‌లిపి మంత్రి గొట్టిపాటి ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడారు.

'ప్రజ‌ల్లో సంతృప్త స్థాయిలు పెరిగేలా విద్యుత్ ఉద్యోగులు విధులు నిర్వహించాలి. అదే విధంగా విద్యుత్ ఉద్యోగుల‌పై ఉన్న ప‌ని ఒత్తిడిని త‌గ్గించేందుకు సీఎం చంద్రబాబు అనుమ‌తితో త్వర‌లోనే నూత‌న నియామ‌కాలు చేప‌డుతున్నాం. మెడిక‌ల్ ఇన్సూరెన్స్ లిమిట్‌కు సంబంధించి ఏవైనా స‌మ‌స్యలు ఉంటే ప‌రిష్కారం దిశ‌గా చ‌ర్యలు చేప‌డ‌తాం.'అని మంత్రి మంత్రి హామీ ఇచ్చారు.

విద్యుత్ ఉద్యోగులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్...