భారతదేశం, ఫిబ్రవరి 13 -- సూపర్ మార్కెట్‌కు వెళ్లినప్పుడు నిగనిగలాడే 'ఇంపోర్టెడ్' (విదేశీ) యాపిల్స్ మనల్ని ఊరిస్తుంటాయి. ధర ఎంత ఎక్కువైనా సరే, విదేశీ పండు కదా.. ఆరోగ్యం బాగుంటుందని చాలామంది వాటినే కొంటుంటారు. అయితే, ఈ భ్రమను పటాపంచలు చేస్తున్నారు హైదరాబాద్ అపోలో హాస్పిటల్స్‌కు చెందిన ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్.

"ఎక్కువ ధర పెట్టి విదేశీ యాపిల్స్ కొంటున్నారంటే.. మీరు తక్కువ పోషకాలు ఉన్న పండు కోసం ఎక్కువ చెల్లిస్తున్నారని అర్థం" అని ఆయన సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. హిమాచల్ ప్రదేశ్ కొండల్లో, కాశ్మీర్ లోయల్లో పండే దేశీ యాపిల్స్‌లోనే అసలైన పోషకాలు ఉన్నాయని ఆయన గణాంకాలతో సహా వివరించారు.

విదేశీ యాపిల్స్ చూడటానికి చాలా తాజాగా, మెరుస్తూ కనిపిస్తాయి. కానీ ఆ మెరుపు వెనుక ఒక చేదు నిజం ఉందని డాక్టర్ సుధీర్ తెలిపారు. విదేశాల నుంచి...