భారతదేశం, ఫిబ్రవరి 20 -- టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న త్వరలో వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 26న వీరిద్దరి పెళ్లి అత్యంత వైభవంగా జరగనుంది. అయితే ఇప్పటివరకు తమ వ్యక్తిగత జీవితాన్ని, ప్రేమ వ్యవహారాన్ని చాలా సీక్రెట్ గా ఉంచిన ఈ జంట.. తమ పెళ్లి వేడుకను కూడా అత్యంత ప్రైవసీతో జరుపుకోవాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా అంతర్జాతీయ సెక్యూరిటీని రంగంలోకి దించినట్లు వార్తలు వస్తున్నాయి.

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి శుభలేఖ ఆన్‌లైన్‌లో లీక్ కావడం తీవ్ర కలకలం రేపింది. ఈ కార్డులో పెళ్లి తేదీ, సమయం, వేదిక, ముఖ్యమైన కాంటాక్ట్ నంబర్లు కూడా బయటకు వచ్చాయి. దీంతో తమ ప్రైవసీకి భంగం వాటిల్లకుండా ఈ జంట సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

పెళ్ళికి ఇంకా వారం రోజుల సమయం మాత్రమే ఉండటంతో, ...