భారతదేశం, ఆగస్టు 11 -- విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో కబడ్డీకి కొత్త ఉత్సాహాన్ని తీసుకురావడానికి "యువ ఆంధ్ర ఛాంపియన్‌షిప్ 2025" సిద్ధమైంది. ఆగస్టు 15 నుంచి 25 వరకు, విజయవాడలోని చెన్నుపాటి రామకోటయ్య మున్సిపల్ కార్పొరేషన్ ఇండోర్ స్టేడియంలో ఈ క్రీడా సంబరాలు జరగనున్నాయి. ఈ 11 రోజుల టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని ఎనిమిది కబడ్డీ జట్లు పాల్గొంటాయి, మొత్తం 46 ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ ఛాంపియన్‌షిప్ తెలుగు కబడ్డీ లీగ్‌లోకి వెళ్లేందుకు యువ క్రీడాకారులకు ఒక మంచి వేదిక కానుంది.

"యువ ఆంధ్ర ఛాంపియన్‌షిప్.. రాబోయే తెలుగు కబడ్డీ లీగ్‌కు ఒక గేట్‌వేగా పనిచేస్తుంది. ఈ టోర్నమెంట్‌లో పాల్గొనే ప్రతి క్రీడాకారుడికి తెలుగు కబడ్డీ లీగ్‌కు అర్హత సాధించేందుకు మంచి అవకాశం లభిస్తుంది. ఇక్కడ తమ నైపుణ్యాలను నిరూపించుకుంటే, చాలా మంది వృత్తిపరమైన స్కౌట్ల దృష్టిని ...