Hyderabad, ఆగస్టు 14 -- మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హిందీలోకి, బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న సినిమా వార్ 2. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. వైఆర్ఎఫ్ బ్యానర్‌లో ఆదిత్య చోప్రా నిర్మించిన వార్ 2 ఇవాళ (ఆగస్ట్ 14) థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

మరోవైపు ఇవాళే రజనీకాంత్ కూలీ రిలీజ్ కానుంది. రజనీకాంత్ కూలీతో పోటీ పడుతూ ఈ ఇండిపెండెన్స్ డే వీకెండ్‌లో వార్ 2 రిలీజ్ కానుంది. 2019లో వచ్చిన వార్ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ వార్ 2 ప్రీమియర్స్ ఇదివరకే పడిపోయాయి. వార్ 2 ప్రీమియర్ షోల చూసిన నెటిజన్స్‌పై రివ్యూలు ఇస్తున్నారు. మరి వార్ 2 ట్విటర్ రివ్యూలు ఎలా ఉన్నాయో చూద్దాం.

"వార్ 2 ఇన్‌సైడ్ టాక్: మంచి యాక్షన్ సీక్వెన్స్. హృతిక్ రోషన్ త...