భారతదేశం, ఏప్రిల్ 19 -- హెచ్‌సీయూ భూముల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన 400 ఎకరాల విధ్వంసాన్ని.. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచీ తీవ్రంగా ఖండించిందని.. ఆ పార్టీ ఎంపీ రఘునందన్ రావు స్పష్టం చేశారు. 1965లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం.. అటవీ భూములే కాకుండా వృక్ష సమృద్ధిగా ఉన్న ప్రాంతాలను కూడా అడవులుగా గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయాన్ని ఇటీవల కేటీఆర్ పదేపదే గుర్తుచేస్తున్నారని వ్యాఖ్యానించారు.

'ఈ బుల్డోజర్ విధ్వంసాన్ని బీజేపీ తరఫున నిరంతరం వ్యతిరేకిస్తూ.. కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, భూపేందర్ యాదవ్‌ను కలిసి ఫిర్యాదు చేశాం. హెచ్‌సీయూ భూముల విషయంలో ఓ బీజేపీ ఎంపీ పాత్ర ఉందంటూ, కాంగ్రెస్ పార్టీకి డబ్బులు ఇస్తున్నారని ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్న కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. కంచ గచ్చిబౌలి...