భారతదేశం, జూలై 9 -- వాట్సాప్ తన వినియోగదారుల చాటింగ్ అనుభవాన్ని మరింత మెరుగ్గా మార్చడానికి కొత్త ఫీచర్లను తీసుకువచ్చింది. ఈ ఫీచర్లు జిఐఫ్ కీబోర్డుల కోసం ఒకటి. మరోకొటి చాట్ థీమ్ సెట్టింగ్. కొత్త ఫీచర్ మునుపటి కంటే జిఐఫ్ కీబోర్డులో ఎక్కువ అంశాలను చూపిస్తుంది. దీనితో వినియోగదారులు చాటింగ్ చేసేటప్పుడు సరైన జిఫ్ కోసం సులభంగా సెర్చ్ చేయవచ్చు.

వాట్సప్ లో ఈ కొత్త ఫీచర్‌ను డబ్ల్యూఏబీటాఇన్ఫో రిపోర్ట్ చేసింది. డబ్ల్యూఏబీటాఇన్ఫో ఆండ్రాయిడ్ 2.25.20.11 వాట్సాప్ బీటాలో గూగుల్ ప్లే స్టోర్లో కొత్త జిఫ్ కీబోర్డ్‌ను గుర్తించింది. ఏఐ ఆధారిత చాట్ వాల్ పేపర్లను క్రియేట్ చేసే ఫీచర్ను కూడా వాట్సాప్ అందుబాటులోకి తీసుకువస్తోంది. ఆ వివరాలు తెలుసుకుందాం.

డబ్ల్యూఏబీటాఇన్ఫో కొత్త జిఐఫ్ కీబోర్డు స్క్రీన్ షాట్‌ను కూడా షేర్ చేసింది. షేర్ చేసిన స్క్రీన్ షాట్ ప్రకారం.. క...