భారతదేశం, ఏప్రిల్ 21 -- యూజర్స్​కి ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్​ని తీసుకొచ్చే వాట్సాప్​ నుంచి మరో బిగ్​ అప్డేట్​ రాబోతోంది! మేసేజ్​ ట్రాన్స్​లేషన్​ ఫీచర్​పై సంస్థ పనిచేస్తోంది. ఇది ఇప్పటికే ఆండ్రాయిడ్​ స్మార్ట్​ఫోన్స్​లోని వాట్సాప్​ బీటా వర్షెన్​లో అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ కొత్త వాట్సాప్ 'ట్రాన్స్​లేట్​ మెసజ్​'​​ ఫీచర్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఈ వాట్సాప్​ మేసేజ్​ ట్రాన్స్​లేషన్​ ఫీచర్​ ప్రస్తుతం టెస్టింగ్​ దశలో ఉంది. వాట్సాప్​ లేటెస్ట్​ బీటా వర్షెన్​లో.. ఆటోమెటిక్​ ఆన్​-డివైజ్​ మెసేజ్​ ట్రాన్స్​లేషన్స్​ కోసం సెట్టింగ్స్​లో కొత్త ఆప్షన్​ కనిపించింది. వాస్తవానికి వాట్సాప్​లో మెసేజెస్​కి ఎండ్​-టు-ఎండ్​ ఎన్​క్రిప్షన్​ ఉంటుంది. అందువల్ల ఈ కొత్త 'ట్రాన్స్​లేట్​ మెసేజ్​' ఫీచర్​ కంపెనీ సర్వర్ల దగ్గర కాకుండ...