Hyderabad, జూలై 10 -- ఫోర్బ్స్ మ్యాగజైన్ బుధవారం (జులై 9) ఒక ఆసక్తికరమైన జాబితాను విడుదల చేసింది. అమెరికాలో అత్యంత విజయవంతమైన ఇమ్మిగ్రెంట్స్ (వలసదారులు) అందులో ఉన్నారు. ఈ జాబితాలో బిలియనీర్ వలసదారుల పేర్లు ఉన్నాయి. వీరు అమెరికా వెలుపల జన్మించి, యునైటెడ్ స్టేట్స్‌కు వలస వచ్చి గొప్ప విజయాన్ని సాధించారు.

ఎలోన్ మస్క్, పీటర్ థీల్, సత్య నాదెళ్ల, జార్జ్ సోరోస్ వంటి పేర్లు ఈ జాబితాలో ప్రముఖంగా నిలిచినా.. ఎంటర్టైన్మెంట్ వరల్డ్ నుండి కూడా కొందరు ప్రముఖులు ఉన్నారు. వీరిలో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన నటుడు కూడా ఉన్నాడు.

77 ఏళ్ల ఈ నటుడు ఒక నాజీ కుటుంబంలో పుట్టి, అమెరికాకు అత్యంత ప్రియమైన యాక్టర్స్ లో ఒకరిగా మారాడు. అతడు ఎవరో కాదు.. కాలిఫోర్నియా మాజీ గవర్నర్, యాక్షన్ స్టార్ ఆర్నాల్డ్ ష్వార్జెనెగ్గర్. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన నటుడు. ఫోర్బ్స్ ప్రక...