భారతదేశం, నవంబర్ 5 -- వరంగల్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(నిట్‌)లో గేట్ కోచింగ్ ఫ్రీగా ఇవ్వనుంది. ఈ ఉచిత గేట్ కోచింగ్ తరగతులు ఎస్సీ, ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్టుగా నిట్ డైరెక్టర్ బిద్యాధర్ వెల్లడించారు. ఈ కోచింగ్ అనేది వరంగల్ నిట్ విద్యార్థులతోపాటుగా వరంగల్ పరిసర ప్రాంతాల్లోని ఇతర ఇంజినీరింగ్ కాలేజీల విద్యార్థులు కూడా ఉపయోగించుకోవచ్చు.

త్వరలో విద్యార్థులకు క్లాసులు అందుబాటులో ఉంటాయని, తరగతులు ఇంజినీరింగ్ శాఖలకు సంబంధించినట్టుగా నిట్ డైరెక్టర్ వెల్లడించారు. ఈ కోర్సును ఎనిమిది వారాలపాటు చెప్పనున్నారు. నవంబర్ 17వ తేదీ నుంచి జనవరి 9 వరకు తరగతులు జరుగుతాయి.

ఎవరైతే ఇంజినీరింగ్ విద్యార్థులు గేట్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నారో.. వారికి ఇది చాలా ఉపయోగపడనుందని నిట్ డైరెక్టర్ అన్నారు. పరీక్షకు సమర్థవంతంగా సిద్ధం అయ్యేందుకు సా...