భారతదేశం, నవంబర్ 14 -- చాలా కాలంగా ఎదురుచూస్తున్న వన్‌ప్లస్ 15 ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను వన్‌ప్లస్ సంస్థ తాజాగా భారతదేశంలో విడుదల చేసింది. ఈ సరికొత్త డివైజ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ఎలైట్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది వన్‌ప్లస్ 13కి సక్సెసర్​గా వచ్చింది. చైనా టెక్ దిగ్గజం నుంచి వచ్చిన ఈ ఫోన్.. ప్రీమియం ధరల సెగ్మెంట్‌లో ఉన్న అనేక ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లకు గట్టి పోటీనిస్తోంది. ఈ కథనంలో, ఐఫోన్ 17, వన్‌ప్లస్ 15ల ధరలు, స్పెసిఫికేషన్లను వివరంగా పోల్చి చూద్దాం.

వన్‌ప్లస్ 15 బేస్ మోడల్ (12GB ర్యామ్ + 256GB స్టోరేజ్) ధర రూ. 72,999. కాగా, 16GB ర్యామ్ + 512GB స్టోరేజ్ వేరియంట్ రూ. 75,999 కి లభిస్తుంది. అల్ట్రా వయొలెట్, సాండ్ స్టోర్మ్, ఇన్‌ఫినిట్ బ్లాక్ వంటి కలర్​ ఆప్షన్స్​ ఉన్నాయి.

ఇక ఐఫోన్ 17 బేస్ 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 82,900గా ఉంది. 5...