భారతదేశం, నవంబర్ 2 -- చైనాలో విడుదలైన వెంటనే, రెండు కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లు వన్​ప్లస్ 15 5జీ, రియల్‌మీ జీటీ 8 ప్రో 5జీ.. త్వరలో భారత మార్కెట్లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు కూడా క్వాల్కమ్ సరికొత్త స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌తో పనిచేస్తాయి. పనితీరు, డిస్‌ప్లే, కెమెరా సెటప్​, ధరల పరంగా ఈ రెండు రాబోయే పరికరాలను పోల్చి చూద్దాము..

వన్​ప్లస్ 15, రియల్‌మీ జీటీ 8 ప్రో స్మార్ట్​ఫోన్స్​ రెండూ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌ని పొందుతున్నాయి. ఈ ప్రాసెసర్‌ను మెరుగైన సీపీయూ సామర్థ్యం, మెరుగైన గేమింగ్ ప్రతిస్పందన, అధిక శక్తి సామర్థ్యం అందించేలా రూపొందించారు. ఈ రెండు మోడళ్లు ఒకే ప్రాసెసర్​ను పంచుకుంటున్నందున, మల్టీటాస్కింగ్, యాప్ నిర్వహణలో వినియోగదారులు దాదాపు ఒకే విధమైన పనితీరును ఆశించవచ్చు.

ర...