భారతదేశం, నవంబర్ 5 -- భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు 91.7 శాతం పూర్తయ్యాయని, వచ్చే నెలలో ట్రయల్ రన్ ప్రారంభిస్తామని పౌర విమానయాన శాఖ మంత్రి కింజారావు రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. విజయనగరం ఎంపీ కలిసెట్టి అప్పల నాయుడుతో కలిసి మంత్రి విమానాశ్రయాన్ని సందర్శించి పనుల పురోగతిని అంచనా వేశారు. ఉత్తర ఆంధ్ర సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా భోగాపురం విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి మీడియాతో అన్నారు. కొన్ని 5 స్టార్ హోటళ్ళు కూడా వస్తున్నాయన్నారు.
'స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలను సృష్టించడమే మా లక్ష్యం. ఈ ప్రాంతంలో అభివృద్ధి వేగం పుంజుకుంటుంది. టాక్సీవేలు, రన్వేలు త్వరగా, నాణ్యతతో అభివృద్ధి అవుతున్నాయి. భోగాపురం నుండి విమానాలను ప్రారంభించడానికి కొన్ని విమానయాన సంస్థలతో చర్చలు జరుగుతున్నాయి.' అని రామ్మోహన్ నాయుడు అన్నారు....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.