భారతదేశం, ఫిబ్రవరి 18 -- ఫిబ్రవరి 15 ఆదివారం నాడు తెలంగాణలోని జగిత్యాలలోని కోరుట్ల బస్ స్టేషన్‌లో బుర్ఖా, స్కార్ఫ్ ధరించిన మహిళగా పోజులిచ్చిన ఘటనలో ఇద్దరు యువకులపై కేసు నమోదు చేశారు పోలీసులు. కోరుట్ల సబ్-ఇన్స్పెక్టర్ చిరంజీవి ఈ సంఘటనను ధృవీకరించారు. యువకులు ఇన్‌స్టాగ్రామ్ కోసం వీడియోలు చేయడానికి బుర్ఖా ధరించారని చెప్పారు. ఈ సంఘటన ఆదివారం మధ్యాహ్నం కోరుట్ల బస్ స్టేషన్‌లో జరిగిందని వెల్లడించారు.

బుర్ఖా ధరించిన యువకుడు మహ్మద్ నుమాన్. అతను తన స్నేహితుడు మహ్మద్ అకీల్‌తో కలిసి ఇన్‌స్టాగ్రామ్ వీడియోలు చేయడానికి వచ్చాడు. 21 ఏళ్ల నుమాన్ బస్ స్టేషన్‌లోని మహిళల మధ్యలో కూర్చుని ఉండటంతో ప్రయాణికులకు అనుమానం వచ్చింది. వెంటనే అతడిని పట్టుకున్నారు. పురుషుడని తెలిసింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

నుమాన్ గతంలో కూడా అకీల్‌తో కలిసి సోషల్ మీడియా కో...