భారతదేశం, ఏప్రిల్ 29 -- 2025 కెనడా ఎన్నికల్లో ప్రధానమంత్రి మార్క్​ కార్నీ నేతృత్వంలోని లిబరల్​ పార్టీ విజయం దిశగా అడుగులు వేస్తోంది. ఫలితంగా మార్క్​ మరోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టడానికి రెడీ అవుతున్నారు. అయితే ఇంకొన్ని సీట్లల్లో కౌంటింగ్​ కొనసాగుతుండటంతో లిబరల్​ పార్టీకి పూర్తి మెజారిటీ దక్కుతుందా? లేదా మైనారిటీ ప్రభుత్వాన్ని నడిపించాలా? లేక స్వల్ప మెజారిటీతో గట్టెక్కుతందా? అన్న ప్రశ్నలు ఇప్పుడు ఉత్కంఠగా మారింది. మరోవైపు.. మార్క్​ కార్నీ గెలుపుతో ఇటీవలి కాలంలో బలహీనపడిన భారత్​- కెనడా సంబంధాలవైపు ఫోకస్​ షిఫ్ట్​ అయ్యింది.

లేటెస్ట్​ అప్డేట్స్​ ప్రకారం.. 343 సీట్లున్న కెనడా పార్లమెంట్​ని లిబరల్స్​ దక్కించుకున్నారు. కానీ సీట్ల విషయంలో ప్రతిపక్ష కన్జర్వేటివ్​ పార్టీకి లిబరల్స్​ పార్టీకి మధ్య స్వల్ప వ్యత్యాసం మాత్రమే ఉంది. లిబరల్స్​ 163 చోట్ల ...