భారతదేశం, జనవరి 29 -- హైదరాబాద్: భారతదేశపు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజాల్లో ఒకటైన ప్యూర్ ఈవీ సంస్థ, ఫ్రాన్స్‌కి చెందిన అగ్రగామి క్లైమేట్ టెక్ కంపెనీ బీ ఎనర్జీతో (BE Energy) వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. భారత్‌లో ఈ తరహా భాగస్వామ్యాల్లో ఇదే మొట్టమొదటిది. అధునాతన Li-Ion బ్యాటరీ రీకండీషనింగ్ సాంకేతికతను భారతీయ మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు, ఎలక్ట్రిక్ మొబిలిటీకి సంబంధించి సుస్థిరత, డీకార్బనైజేషన్‌ ప్రయత్నాలకు మరింతగా ఊతమిచ్చేందుకు ఇది ఉపయోగపడుతుంది.

బ్యాటరీ రీకండీషనింగ్‌లో అంతర్జాతీయ దిగ్గజమైన బీ ఎనర్జీ, ఈ భాగస్వామ్యం ద్వారా భారత్‌లో తమ కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఈ భాగస్వామ్యమనేది, ప్యూర్ ఈవీ రూపొందించి, పేటెంట్ పొందిన బ్యాట్రిక్స్‌ఫారడే సాంకేతికత, బీ ఎనర్జీకి చెందిన పేటెంటెడ్ హై-టెక్ పరికరాల సమ్...