భారతదేశం, ఫిబ్రవరి 24 -- విరోష్.. ఇప్పుడు సోషల్ మీడియాలో, ఇంటర్నెట్ లో ఎక్కడ చూసినా ఇదే ట్రెండింగ్. రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ జంటకు ఫ్యాన్స్ పెట్టిన పేరు ఇది. ఈ లవ్ బర్డ్స్ ఫిబ్రవరి 26న పెళ్లి చేసుకుంటున్న నేపథ్యంలో రష్మిక, విజయ్ విషయాలు హాట్ టాపిక్ గా మారాయి. వీళ్ల లవ్ స్టోరీ గురించి తెలుసుకోవాలని నెటిజన్లు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

విరోష్ వెడ్డింగ్

లవ్, డేటింగ్, రిలేషన్ షిప్.. ఇలా రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ బంధంపై కొంత కాలంగా చాలా పుకార్లు వచ్చాయి. కానీ ఈ జంట ఎప్పుడూ వీటిపై గతంలో మాట్లాడలేదు. కలిసే వెకేషన్లకు వెళ్లినా, జంటగా కనిపించినా కానీ సైలెంట్ గానే ఉండిపోయారు. కానీ ఇప్పుడు వెడ్డింగ్ పై అనౌన్స్ మెంట్ చేయాల్సిన టైమ్ రావడంతో సోషల్ మీడియాలో విరోష్ వెడ్డింగ్ అంటూ ఓ ప్రకటన రిలీజ్ చేశారు. తమ పెళ్లిని కన్ఫామ్ చేశారు.

రష్మిక, విజ...