భారతదేశం, జనవరి 29 -- తెలంగాణ నుంచి ఏపీ మీదుగా తమిళనాడుకు ప్రయాణించే చార్మినార్ ఎక్స్ ప్రెస్ కు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న గమ్యస్థానాల్లో మార్పులు చేయనున్నట్లు పేర్కొంది. ఈ నిర్ణయం ఫిబ్రవరి 3వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించింది.

సాధారణంగా చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ హైదరాబాద్ నుంచి తమిళనాడులోని తాంబరం వరకు రాకపోకలు సాగిస్తుంటుంది. అయితే చెన్నై ఎగ్మోర్ స్టేషన్ లో ప్రస్తుతం అభివృద్ది పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రైలును తాంబరం స్టేషన్ వరకు కాకుండా తాత్కాలికంగా చెన్నై బీచ్ రైల్వే స్టేషన్ వరకే పరిమితం చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా హైదరాబాద్ నుంచి వివిధ స్టేషన్ల మీదుగా ఈ రైలులో ప్రయాణాలు చేసే వారు తమ టికెట్లను చెన్నై బీచ్ స్టేషన్ వరకే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

హ...