భారతదేశం, నవంబర్ 24 -- 2025 మచ్​ అవైటెడ్​ కార్స్​లో టాటా సియెర్రా ఒకటి. ఈ ఎస్​యూవీ రేపు, 25 నవంబర్​ 2025న భారత దేశంలో లాంచ్​కానుంది. 1991లో తొలిసారి భారత రోడ్లపై కనిపించిన ఈ సియెర్రా ఇప్పుడు సరికొత్త అవతారంలో భారతీయులను పలకరించనుంది. ప్రస్తుతం ఇది పెట్రోల్​, డీజిల్​ ఇంజిన్​లతో లాంచ్​ అవుతుంది. తర్వాతి నెలల్లో ఈవీ ఆప్షన్​ కూడా అందుబాటులో ఉంటుంది. అయితే, స్టైల్​తో పాటు టెక్నాలజీ పరంగా కూడా టాటా సియెర్రా అదరగొట్టనుంది! ఈ ఎస్‌యూవీలో చాలా ఫీచర్లు ఉన్నాయి. వీటిలో కొన్ని టాటా కార్లలో మొదటిసారిగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టాటా మోటార్స్ చరిత్రలోనే సియెర్రాలో తొలిసారిగా పరిచయం చేస్తున్న 5 కొత్త ఫీచర్ల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

1. ట్రిపుల్-స్క్రీన్ సెటప్

25 నంవబర్​ 2025న లాంచ్​కానున్న టాటా సియెర్రాలో సరికొత్త మూడు స్క్రీన్ల డాష్‌బోర్డ్ లేఔట్...