Hyderabad, సెప్టెంబర్ 6 -- హిందూ మతంలో పౌర్ణమి స్థితికి ఉన్న విశిష్టత గురించి మనకి తెలుసు. ఈసారి భాద్రపద పౌర్ణమి సెప్టెంబర్ 7న వచ్చింది. పితృపక్షం కూడా అదే రోజు నుంచి మొదలవుతోంది. పైగా భాద్రపద పౌర్ణమి నాడు చంద్ర గ్రహణం కూడా ఉంది. ఈ గ్రహణం సెప్టెంబర్ 7 రాత్రి 9:56కి మొదలై తెల్లవారుజామున 1:26 వరకు ఉంటుంది.

ఇది మన భారతదేశంలో కనబడుతుంది కాబట్టి సూతక కాలం ఉంటుంది. అయితే గ్రహణం పూర్తయిన తర్వాత కొన్ని వస్తువులను దానం చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. మరి చంద్రగ్రహణం తర్వాత ఏ రాశి వారు వేటిని దానం చేయాలో ఇప్పుడే తెలుసుకుందాం.

మేష రాశి వారు ఈ చంద్రగ్రహణం పూర్తయిన తర్వాత ఎర్ర పప్పులను దానం చేయడం మంచిది. అలా చేయడం వలన ఎప్పటినుంచో పూర్తికాని పనులు అన్నీ కూడా పూర్తవుతాయి.

వృషభ రాశి వారు తెల్లటి వస్తువుల్ని దానం చేస్తే మంచిది. బియ్యం, పెరుగు వంటివి ద...