భారతదేశం, అక్టోబర్ 28 -- సుప్రసిద్ధ మసాలా దినుసులు, ఫుడ్ బ్రాండ్స్​ ఎంటీఆర్​, ఈస్టర్న్​లను కలిగి ఉన్న ఓర్క్​లా ఇండియాకు సంబంధించిన ఇనీషయల్​ పబ్లిక్​ ఆఫర్​ (ఐపీఓ)పై మంచి బజ్​ ఉంది. బుధవారం ఓపెన్​కానున్న ఈ ఐపీఓ సబ్​స్క్రిప్షన్​ ప్రైజ్​ బ్యాండ్​ని షేరుకు రూ. 695 నుంచి రూ. 730 గా నిర్ణయించారు.ఈ నేపథ్యంలో ఈ ఐపీఓలో పెట్టుబడి పెట్టే ముందు ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలను ఇక్కడ చూసేయండి..

1. ఓర్క్​లా ఇండియా ఐపీఓ తేదీలు

ఓర్క్​లా ఇండియా ఐపీఓ సబ్​స్క్రిప్షన్​ అక్టోబర్ 29న ప్రారంభమై, అక్టోబర్ 31న ముగుస్తుంది. ఈ షేర్లు నవంబర్ 6న స్టాక్ ఎక్స్​ఛేంజీల్లో లిస్ట్ అయ్యే అవకాశం ఉంది.

2. ఓఎఫ్​ఎస్​ వివరాలు

ఈ ఇష్యూ మొత్తం ఆఫర్ ఫర్ సేల్ (ఓఎప్​ఎస్​) రూపంలో ఉంది. ఇందులో ప్రమోటర్, ఇతర విక్రేత వాటాదారులు దాదాపు 2,28,43,004 షేర్లను విక్రయించనున్నారు. ...