భారతదేశం, మే 15 -- టీడీపీలో ప్రతి కార్యకర్త కూటమి ప్రభుత్వం చేసింది చెప్పుకోవాలని, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 4వేల పెన్షన్ ఇవ్వడం లేదని, అవ్వతాతలకు అండగా నిలిచేందుకే పెన్షన్ పెంచామని, ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లిస్తున్నామని.. వాటిగురించి పార్టీ కార్యకర్తలంతా ప్రజల్లోకి వెళ్లి మాట్లాడాలని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ అన్నారు.

గుంతకల్లు నియోజకవర్గం గుత్తి సమీపంలోని రామరాజుపల్లిలో ఉత్తమ కార్యకర్తల సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ....అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్లే కసితో పనిచేయాలని, బాబు సూపర్ - 6, బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీలో పార్టీ తరపున పలు హామీలు ఇచ్చామని ఒక్కొక్కటిగా వాటిని అమలుచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

11నెలల ప్రజా ప్రభుత్వంలో వృద్ధాప్య పెన్షన్ 4వేలకు, వికలాంగ పెన్షన్...